
Women child welfare Jobs Recruitment – 2024
విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులు
విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 23.
» పోస్టుల వివరాలు: డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీ సర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెం ట్, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏడో తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్ కాంప్లెక్స్, విజయనగరం, విజయన గరం జిల్లా చిరునామకు పంపించాలి.
చివరి తేదీ : 20.09.2024.