Ts DSC answer 2024, Response sheet 2024, Question paper

Ts DSC answer 2024, Response sheet 2024, Question paper

రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటి కి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యా య పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్ సి పరీక్షలు ఈనెల 5వ తేదీతో ముగిసాయి. గత 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించారు.

డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రాథ మిక కీలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నా రు. అనంతరం ప్రాథమిక కీ లపై అభ్యంతరాలను స్వీక రిస్తారు. నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన అ భ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నాప త్రాల తుది కీ ఖరారు చేస్తారు.

ఈ ప్రక్రియ దాదాపు రెం డు వారాల్లో ముగియనుంది. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి నిర్వహించిన నేప థ్యంలో తుది కీ ఖరారైన వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోంబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు.

డిఎస్సికి 87.61 శాతం హాజరు నమోదు

డిఎస్సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *