Telangana social welfare Gurukula schools job notification

Telangana social welfare Gurukula schools job notification

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో

ఐసిటి (ఇన్స్ట్రక్టర్), పిఆర్ఎ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థలోని ఏడూ జోన్లలో ఇన్ఫర్మేష న్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఇన్స్ట్రక్టర్స్ ఔట్ సోర్స్ ప్రాతిపదికన పనిచేసేందుకు సాంఘీక సంక్షే మ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులను ఆహ్వా నించింది. ఐ సిటిలకు, డిపి ఓలకు గౌరవవ వేతనం చెల్లిం చడం జరుగుతుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం హైదరా బాద్ లో పని చేయడానికి ఇద్దరు (2) పిఆర్ఓ లను ఒక సీనియర్ పిఆర్, ఒక జూనియర్ పిఆర్ లను నియమిం చేందుకు 11 నెలల కాలపరిమితి తో కన్సల్టెంట్ కు ఇచ్చే గౌరవ వేతనం ఉంటుంది. పని తీరు ఆధారంగా, సంస్థ నియమ నిబంధనలను అనుసరించి వారి సేవలను పున రుద్ధరించడం జరుగుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలి పింది. ఐసిటిలకు ఎం.టెక్ లేదా బి.టెక్ (కంప్యూటర్స్,

ఈసీఈ, ఈఈఈ), లేదా ఎంఎస్సి (కంప్యూటర్స్), లే దా ఎంసిఎతో పాటు మంచి మార్కుల శాతం, బోధన అ నుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. జోన్ –1లో 5 పోస్టులు, జోన్-2లో 5, జోన్-3లో 12, జోన్ −4లో 8, జోన్-5లో 9, జోన్-6లో 18, జోన్-7లో 8 ఖాళీలు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. సీనియర్ పిఆర్ఎ లకు డిగ్రీ ఇన్ జర్నలిజం (తప్పనిసరి), డిగ్రీ ఇన్ లా (ప్రా ధాన్యత), తెలుగు, ఆంగ్లంలో మంచి వాక్చాతుర్యంతో పాటు, చేతి రాత తప్పనిసరిగా ఉండాలి.

ఉర్దూకు ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు జర్నలిజంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన అను భవం ఉండాలి. తెలంగాణకు చెందిన ప్రముఖ వార్త పత్రి కల్లో బ్యూరో చీఫ్ లేదా, ఎడిటర్, లేదా /సీనియర్ జర్న లిస్ట్లగా పనిచేసిన అనుభవం ఉన్నా అభ్యర్థులకు ప్రాధా న్యత ఇవ్వబడును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *