నిమ్స్ 101 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి
- కాంట్రాక్టు పద్ధతిలో నియామకం
నిమ్స్ ఆస్పత్రి మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
🔷మొత్తం 101 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ నుంచి దరఖాస్తు ఫామ్‌ను తీసుకుని చేసుకుని ఆఫ్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
🔷ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిమ్స్ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
🔷 రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, అనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయోమెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్‌తో పాటు పలు విభాగాల్లో 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
🔷అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు రూ.32,500.
🔷ఈ పోస్టు లను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేక రాత పరీక్ష ఉంటుంది.
🔷ఈ విషయంపై అధికా రులు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు.
🔷 Join telegram for more updates
🔷 Please share it with your Friends