RTC latest job notifications 2025 | TS RTC latest jobs
మెరుగుపరచడానికి ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లలో కొనుగోలు చేయ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 3,500 మంది ఉద్యోగులు పదవీ విర మణ పొందినా.. ఒక్క ఉద్యోగినీ నియమించలేదన్నారు. తాము 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలను చేపడుతున్నామన్నారు. గురువారం సిద్ది పేట జిల్లా హుస్నాబాద్లో రూ.2 కోట్ల వ్యయంతో ఆధు నికీకరించిన ఆర్టీసీ బస్ స్టేషన్ను ప్రారంభించారు. అనం తరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2000 బస్సులు కొనుగోలు చేసిందన్నారు.
మరో 600 బస్సులను స్వశక్తి మహిళా సంఘాల ద్వారా కొంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో వాయు కాలు ష్యాన్ని తగ్గించడానికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. కొత్తగా పెద్దపల్లి, ములుగులలో ఆర్టీసీ బస్ డిపోలను ప్రారంభిస్తు
హుస్నాబాద్ సభలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం. వేదికపై ఆర్టీసీ ఈడీ కె.ఎస్.ఖాన్, కలెక్టర్ మనుచౌదరి తదితరులు
న్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద 134 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. తాము కార్గో సేవలు విస్తృతం చేస్తున్నామని, ఇందులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అవ కాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని డిపోలు, ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసు కోవాలని పొన్నం సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్టీసీ ఈడీ కె.ఎస్.ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పాల్గొన్నారు.
–