రైల్వే వికాస్ నిగమ్లో..
దిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన 24 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (06)
» సీనియర్ మేనేజర్ (06)
అసిస్టెంట్ మేనేజర్ (02)
» సీనియర్ ఎగ్జిక్యూటివ్ (10)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీకామ్, ఎంబీఏ (ఫైనాన్స్) తో పాటు పని అనుభవం.
వయసు: డీజీఎం పోస్టుకు 45 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్స్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా.
ఎగ్జిక్యూటివ్ పోస్టులు
దిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 20 ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
అర్హత: బీకాంతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు రూ.50,960.
వయసు: 01-08-2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఈ రెండు రకాల పోస్టులకూ…
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా, ఆర్కే పురం, న్యూదిల్లీ’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-09-2024.