పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 435 ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది.
✳️గేట్-2024 స్కోరుతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి మెరుగైన ప్రతిభ చూపినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
✳️చివరి ఏడాది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యో గాల్లో.. ఎలక్ట్రికల్-331, సివిల్-53, కంప్యూ టర్ సైన్స్-37, ఎలక్ట్రానిక్స్-14 ఖాళీలు ఉన్నాయి. 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీ సెమెన్‌కు తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/ డిపార్ట్మెంటల్ అభ్యర్ధు లకు ఫీజు లేదు. ఒక్కో విభాగంలో ఉన్న ఖాళీలు, వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల వివరాలు చూద్దాం.
ఎలక్ట్రికల్-331: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్
(పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీ రింగ్ (ఎలక్ట్రికల్) బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) అరవై శాతం మార్కులతో పాసవ్వాలి.
సివిల్–53: సివిల్ బ్రాంచ్ బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో పూర్తిచే యాలి.
కంప్యూటర్ సైన్స్-37:
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇప్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ తో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీ రింగ్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
ఎలక్ట్రానిక్స్-14: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికే షన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూ నికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరిం గ్ లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంట ర్వ్యూల్లో సమాధానాలు చెప్పడానికి హిందీ లేదా ఇంగ్లిష్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల సమ యంలో గేట్-2024 అడ్మిట్‌కార్డ్, ఒరిజి నల్ గేట్ స్కోర్ కార్డ్ తీసుకెళ్లాలి.
- ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో పేర్కొన్న ధ్రువపత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
- ఇంటర్వ్యూలో అర్రిజ ర్వ్డ్ 40 శాతం, ఓబీసీ (ఎన్సీఎల్), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్య ర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
- గేట్ స్కోరుకు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజీ ఇస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తులో గేట్ రిజిస్ట్రే షన్ నంబర్ రాయాలి.
- ఎంపికైనవారిని పవర్డ్లోగానీ దాని అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ ట్రాన్స్ మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీటీయూఐఎల్) లోగానీ నియ మించవచ్చు.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 04.07.2024
- Official website
- Apply Online
- Thank you for reading this information
- please hear it with your friends
- do follow for more job updates
- Practice daily free current affairs and general knowledge tests