Olympics : One More Medal For INDIA
💥ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం దక్కింది. 10మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ కొల్లగొట్టారు.
▪️ ఈ విజయంతో మనోభాకర్ ఓకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గుర్తింపు పొందింది.
మను భాకర్ బయోగ్రఫీ పూర్తిగా తెలుసుకోండి
మనూ ఎదుట మరో మెడల్?
ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ మరో పతకం సాధించే ఛాన్స్ ఉంది. ఆగస్టు 2న 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్లో రాణిస్తే మనూ ఖాతాలో హ్యాట్రిక్ మెడల్స్ వచ్చి చేరుతాయి. కాగా ఇప్పటికే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన షూటర్గా ఆమె నిలిచిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలతో మెరిసిన షూటర్ మనూ భాకర్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన మూడో భారత అథ్లెట్గా ఆమె నిలిచారు. సుశీల్ కుమార్ షిండే (2008, 2012), PV సింధు (2016, 2020) సరసన ఆమె నిలిచారు. అయితే మను ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గడం విశేషం.