నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో…
Natonal insurance company jobs recruitment -2024
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్), కోల్కతా.. ఒప్పంద ప్రాతిపదికన 16 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడి అభ్యర్ధులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: రెండేళ్లు స్టెపెండ్: నెలకు మొదటి ఏడాది. 40,000, 2 వ ఏడాది నుండి 45,000.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్, ఆఫ్లైన్ [email protected]. ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ది చీఫ్ మేనేజర్, పర్సనల్ డిపార్ట్మెంట్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, పర్మిసెస్ నెం.18-0374, ప్లాట్ సంబర్-సీబీడీ-81, న్యూటౌన్, కోల్కతా’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2024.