Fresher 82000 jobs recruitment -2024

Fresher 82000 jobs recruitment -2024

ఫ్రెషర్స్ సిద్ధం కండి.. ఈ ఏడాది

82 వేల ఉద్యోగాలు

తాజాగా ఉత్తీర్ణులైన వారి కోసం ప్రముఖ ఐటీ కంపెనీలు గుడ్్యూస్ చెప్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగావకాశాలకు సంబంధించి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ సంస్థలు తీపి వార్తను అందించాయి. ఈ నాలుగు సంస్థలు మొత్తం 82వేల మంది ఫ్రెషర్స్ ని ఉద్యోగంలోకి తీసుకుంటామని ప్రకటించాయి.

టీసీఎస్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. కేవలం జూన్ త్రైమాసికంలోనే ఈ సంస్థ 5,452 మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. దీంతో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,06,998 కి చేరింది.

ఇన్ఫోసిస్: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 15 నుంచి 20 వేల మంది ఫ్రెషర్స్ ని ఉద్యోగంలోకి తీసుకోనుంది. కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా వీరిని నియమించుకుంటామని సంస్థ తెలిపింది. ఈ కంపెనీలో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 3,15,332గా ఉంది.

విప్రో: ఈ సంస్థ కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12,000 మందిని ఉద్యోగంలోకి తీసుకోనుంది. గతంలో ఆఫర్ లెటర్ వచ్చినవారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని సంస్థ వెల్లడించింది. 2024 జూన్ చివరికి కంపెనీ సిబ్బంది సంఖ్య 2,34,391గా ఉంది.

హెచ్సీఎల్: ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పదివేల మందికి కొలువు ఇస్తామని హెచ్సీఎల్ సంస్థ గతంలోనే ప్రకటించింది. ఏఐ స్కిల్స్ ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని అన్ని సంస్థలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *