Computer Operator jobs in District study circle
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 06.
» పోస్టుల వివరాలు: ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌం టెంట్-01, కోర్సు కోఆర్డినేటర్-01, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-01, ఆఫీస్ అసిస్టెంట్/అటెండర్-03.
» అర్హత: ఆఫీస్ అసిస్టెంట్/అటెండర్ పోస్టుకు ఏడో తరగతి, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూ టర్ ఆపరేటర్ పోస్టుకు డిగ్రీ, పీజీడీసీఏ, లోయర్ గ్రేడ్ ఇంగ్లిష్/తెలుగు టైప్ రైటింగ్ సర్టి ఫికేట్, కోర్సు కో-ఆర్డినేటర్ పోస్టుకు ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు బీకాం లేదా ఎంబీఏతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
» వేతనం: నెలకు ఆఫీస్ అసిస్టెంట్/అటెండర్ పోస్టుకు రూ.22,000. ఇతర పోస్టులకు 31,000.
» ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
▪️Join telegram for more updates