Central Government jobs recruitment with 10th

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.

‘ఎస్ఎస్సీ’ 8326 ఖాళీలు

పదోతరగతితో కేంద్రంలో కొలువులు

ఎంటీఎస్, హవల్దార్ పోస్టులు

►» తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు

» మొత్తం ఖాళీలు: 8326

» పోస్టుల వారీగా ఖాళీలు: మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ – 4887, హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్) – 3439 ఖాళీలు ఉన్నాయి

» అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు

» వయస్సు: 2024, ఆగస్టు 1 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18- మ 25 ఏండ్లు, హవల్దార్ పోస్టులకు 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

RAILWAY JOBS WITH 10TH & INTER

Transport department jobs apply now

ఎంపిక విధానం:-

ఎంటీఎస్ పోస్టులకు:-

» కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తారు

హవల్దార్ పోస్టులకు:-

» కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ఈ) ద్వారా

» కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను ఇంగ్లిష్/హిందీతోపాటు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు.

» తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు

» ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.

» సీబీఈలో రెండు సెషన్లు ఉంటాయి.

» మొదటి సెషన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్పై ప్రశ్నలు ఇస్తారు

» పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు.

» ప్రశ్నల సంఖ్య 40. మార్కులు 120

» సెషన్-2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 150 మార్కులు. అంటే ఒక్క ప్రశ్నకు 3 మార్కులు.

» పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు

నోట్: సెషన్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. సెషన్-2లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కును కోతవిధిస్తారు.

» హవల్దార్ పోస్టులకు నిర్వహించే పీఈటీలో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి, మహిళలు అయితే ఒక కిలోమీటరు దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్)

» పురుషులు కనీసం 157.5 సెంమీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. గాలి పీల్చినప్పుడు కనీసం ఐదు సెం.మీ. వ్యాకోచించాలి.

» మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు ఉండాలి.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: జూలై 31

» పరీక్ష తేదీలు: అక్టోబర్ నవంబర్ 2024

» రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

►✅ Official website

Official notification

★ ఇలాంటి మరెన్నో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి ఫాలో అవుతూ ఉండండి

★ ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *