![](https://www.rktutorialedu.com/wp-content/uploads/2025/02/IMG_20250208_115011.jpg)
Government job notifications today is last day | Latest government jobs 2025
కింది ఉద్యోగాలకు నేడే (ఫిబ్రవరి 8) చివరి తేదీ
◆జేఎన్పీఏలో కన్సల్టెంట్ పోస్టులు. డిగ్రీ/ ఎల్ఎల్బీ ఉత్తీర్ణులు అర్హులు.
◆ హెచ్పీసీఎల్, రాజస్థాన్ రిఫైనరీలో 121 పోస్టులు, డిప్లొమా, బీఎస్సీ (కెమిస్ట్రీ), బీఈ, బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు.
◆ సీఎస్ఐఆర్ భువనేశ్వర్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు. పదోతరగతి/ ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
◆జేఎన్పీఏలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు. డిగ్రీ, ఎల్ఎల్బీ, హెచ్ఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు.
◾త్వరలో గడువు ముగియనున్న ప్రభుత్వ నోటిఫికేషన్లు👇
అప్రెంటిస్ పోస్టులు
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని), హైదరాబాద్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 120. అర్హులైన అభ్యర్థులు 2025, ఫిబ్రవరి 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నిట్, వరంగల్
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25 ఫిబ్రవరి 2025.
డీఆర్ఎల్-డీఆర్ డీఓ
డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్ఎల్) అస్సాం జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 13. అర్హులైన అభ్యర్థులు 2025, మార్చి 3న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
సీడ్యాక్, బెంగళూరు
బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 124. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 ఫిబ్రవరి 2025.
సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు శాశ్వత ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 8. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 26 ఫిబ్రవరి 2025.