Punjab National Bank jobs recruitment -2024
పంజాబ్ & సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దేశ వ్యాప్తంగా పీఎస్బీ శాఖల్లో లేటరల్ రిక్రూట్మెం ట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
ఖాళీలు: మొత్తం 213 ఖాళీల్లో ఆఫీసర్ పోస్టులు
56, మేనేజర్ 117, సీనియర్ మేనేజర్: 33, చీఫ్ మేనేజర్: 7 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
★ ఇన్ప ర్మేషన్ టెక్నాలజీ, రాజ్భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీబిడబ్ల్యూఏ, సీఎఫ్ఎ, ఎస్ఆర్ఎం, సీఐఐఐబీ, పీజీడీ బీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు
వెబ్సైట్ లో సంప్రదించాలి.