ఆర్టీసీలో త్వరలో 3,035 ఉద్యోగాలు భర్తీ 5 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశాo
కొత్త బస్సులు కొంటున్నాం కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్
త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలను భర్తీ
చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్ తెలిపారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
అవార్డులు పొందిన ఉద్యోగులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీలో పదేళ్లు కనీసం ఒక్క బస్సునూ కొనలేదని, 15 ఏళ్లు దాటిన బస్సులను కూడా తిప్పాదన్నా రు. దీని వలన ఉద్యో గులకు పనిభారం పెరిగేదన్నారు. అందుకే రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత అర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని కొత్త బస్సులు.
రెండోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నా హాలు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటివరకు రూ.2,750 కోట్ల విలువగల ప్రయాణాన్ని ఉచిత మహి ళ పథకం కింద అందజేశామన్నారు. ఉద్యోగుల బాండ్స్ పెరిగాయని రూ.200 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆ నిధులు చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఎండీ వీసీ సజ్జనార్ మా ట్లాడుతూ.. పనికి తగ్గ గుర్తింపు ఉంటేనే ఏ ఉద్యోగు లైనా ఉత్సాహంగా పనిచేస్తుంటారన్నారు. ఈ విషయా న్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం గుర్తించి ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అధికారులు, సి బ్బందికి ప్రతి ఏటా ప్రగతి చక్రం. పేరుతో అవార్డులను అందజేస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్లు కృష్ణకాంత్, వినోద్ కుమార్, వెంకటే శ్వర్లు, ఫైనాన్స్ అడెజర్ విజయపుష్ప, సీపీఎం ఉషాదేవి, తదితరులు పాల్గొన్నారు..