Postal department GDS results -2024

Postal department GDS 2024 results

పోస్టల్ శాఖలో 44,228 పోస్టులు

తెలుగు రాష్ట్రాల తొలి మెరిట్ జాబితా విడుదల

🔷నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖలోని జీడీఎస్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయి. వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ఇదో గుడ్ న్యూస్.

🔷మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా పోస్టల్ శాఖ విడుదల చేసింది.

🔷ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, వారందరినీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. పదో తరగతి అర్హతతో ఎంపిక చేస్తారు.

🔷పైగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధా రంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔷తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి 1,355 మందిని, తెలంగాణ రాష్ట్రం నుంచి 981 మంది ని షార్ట్ లిస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తొలి సెలక్షన్ లిస్టును కంప్యూటర్ జనరేటెడ్ పద్దతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పంపిచారు.

🔷ఈ ప్రక్రియలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 3 లోగా సంబంధిత కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందిస్తారు.

🔷 Click to check results

🔷 Thank you

🔷Join telegram for more updates

🔷 please share it with your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *