
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ
హయత్నగర్ – ప్రాంతం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో 2024-25 విద్యాసంవత్సరం కోసం సంస్కృతం-1, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్-2, స్టాటిస్టిక్స్-1 మొత్తం 3 సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకం చేయనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. జ్యోత్స్నప్రభ ఒక ప్రకటనలో తెలియజేశారు.
సంబంధిత పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. సంబంధిత సబ్జెక్టులో నెట్, స్లెట్, సెట్, పీహెచ్ఎ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
అలాగే ఇంతకుముందు డిగ్రీ కళాశాలలో బోధనానుభవం ఉన్నవారు సర్వీస్ సర్టిఫికెట్ జతచేయలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ 01.07.2024 సాయంత్రం వరకు కళాశాలలో వారి దరఖాస్తులను సమర్పించవలసిందిగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.
ఇలాంటి మీ సొంత జిల్లాలో లేదా ప్రాంతంలో ఉద్యోగ సమాచారం కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
★ Thank you
★ please share it with your Friends