11000 Anganwadi jobs recruitment -2024

అంగన్వాడీల భర్తీకి కసరత్తు

11 వేల మంది నియామకానికి ప్రభుత్వం చొరవ విద్యార్హతలపై నోటిఫికేషన్లోనే స్పష్టత పదోన్నతులతో భారీగా ఖాళీలు నెలనెలా పెరుగుతూ వస్తున్న సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో ఈ వ్యవస్థలో సిబ్బందిని పెంచుకునేందుకు ప్రభుత్వం భావి స్తోంది. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతో పా టు అంగన్వాడీ టీచర్లు, సహాయకులను కూడా పెద్ద ఎత్తు న నియమించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నా హాలు చేస్తోంది.

ఈ మేరకు త్వరలో దాదాపు 11 వేల అంగన్వాడీ, సహాయక సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రా ష్ట ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ చొరవ తీసుకుని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఎంతో మంది మహిళలు ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

రాష్ట్ర వ్యా ప్తంగా 35,500 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటి లో సుమారు 15 వేలకు పైగానే ప్రి ప్రైమరీ స్కూళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంగ న్వాడీలను ప్రి స్కూల్స్ గా మార్చే క్రమంలో సిబ్బందిని సై తం అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

దీని కోసమే ప్ర త్యేకంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చే శారు. అయితే ప్రి స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాం గణంలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క కూడా ఇటీవల వెల్లడించారు. ఈ మేరకు అతి త్వరలోనే అంగన్వాడీ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ నియామకాల్లో మెయిన్ (ప్రధాన) అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు.

అంగన్వాడీ టీచర్ తో 1 పాటు సహాయకులుగా ఎంపికయ్యేవారు కనీసం పది, లే దా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు – దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్, బిసి అభ్యర్థుల వయ సు 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ అ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగివున్న వివాహిత మహిళలు – మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్థ తల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు ఎటు వంటి రాత పరీక్ష నిర్వహించరు. త్వరలో ప్రి స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత జిల్లాల వారీగా ఖాళీలు లెక్కించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది.

అలాగే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం నోటిఫికేషన్ విడుద లైన తర్వాత వివరంగా ప్రభుత్వం వెల్లడిస్తుంది.

ఉద్యోగ విరమణ, పదోన్నతులతో భారీగా ఖాళీలు

రాష్ట్ర వ్యాప్తంగా 65 సంవత్సరాల వయస్సు దాటిని వారి కి ఉద్యోగ విరమణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో సుమారు రాష్ట్రంలో 20 వేల ఖాళీలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. వీరిలో కొం దరు సహాయకులుగా పని చేస్తున్న వారికి పదోన్నతి క ల్పించి వారిని అంగన్వాడీ టీచర్లుగా నియమించనున్నా రు.

మరో విధంగా ఇప్పటికే సూపర్వైజర్లుగా పదోన్నతి పొందడం ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలు కొన్నిచోట్ల ఖా ళీ అయ్యాయి. మరికొన్ని చోట్ల పలు కారణాలతో రాజీనా మా చేసిన అంగన్వాడీ టీచర్ల పోస్టులు కూడా వీటితో పా టు కలిపి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ సూపర్ వైజర్ ఉద్యోగానికి ఐదేళ్ల అంగన్వాడీ టీచర్ సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై నాటికి సుమారు 9 వేల అంగన్వాడీ, సహాయక పోస్టుల ఖాళీలు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 11 వేలకు పెరిగిందని తెలు స్తోంది. దీంతో పలు కారణాలతో పోస్టుల సంఖ్య ప్రతి నెల పెరుగుతూ వస్తోంది.

నేటికీ జారీ కాని విరమణ ప్రయోజనాల జివో

అంగన్వాడీలు, ఆయాల వయో పరిమితి 65 ఏండ్లు దా టితే సర్వీస్ నుంచి ఉద్యోగ విరమణ పేరుతో కొందరిని తొలగించారు. ఇందుకు ప్రతిగా ప్రతి ఒక్క అంగన్వా డీ టీచర్కు రూ.2 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.లక్ష చొప్పున పరిహారంగా అందజేసేందుకు ప్రభుత్వం అంగ న్వాడీ సంఘాలకు హామీ ఇచ్చింది. త్వరలోనే జివో జారీ చేస్తామని మంత్రి సీతక్క సైతం ప్రకటించింది.

ఈ ప్రక్రియ జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన, చేయబోతున్న వా రంతా ఆందోళన చెందుతున్నారు. కొత్తగా అంగన్వాడీల ను చేర్చుకోవా లని భావిస్తున్న ప్రభుత్వానికి తాజాగా మా జీలవుతున్న వారు తమ ప్రయోజనాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *