10th September 2019 – Current Affairs – International, National, State

Daily Current

International – National – AP -Telanagana

Download PDF

జాతీయ అంతర్జాతీయ ఇతర ముఖ్య అంశాలు

  1. దేశీయ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత శాతం నష్టాలను చవిచూసింది..?
    A. 165%
    B. 170%
    C.160%
    D.150%

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం.. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) సంస్థ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే ఏకంగా 165 శాతం ఎగిశాయి. 2018-19లో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నికర నష్టం రూ.3,959.6 కోట్లుగా ఉన్నది. 2017-18లో ఇది రూ.1,490 కోట్లుగానే ఉన్నది. ఈ మేరకు తమ భాగస్వాములకు సంస్థ తెలియజేసింది.
[/bg_collapse]

2. జమ్ము కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జమ్ము కాశ్మీర్ లోని ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు..?
A. కార్గిల్
B. లడక్
C.కారకోరం
D. కాశ్మీర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: D
Explanation : లెహ్, సెప్టెంబర్ 10: కార్గిల్.. ఈ పేరు వినగానే భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం గుర్తుకొస్తుంది. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు సాగిన ఈ సంగ్రామంలో భారత్ ఘన విజయం సాధించింది. భారత భూభాగంలోకి చొరబడిన పాకిస్థాన్ దళాలను ఆపరేషన్ విజయ్ ద్వారా తరిమికొట్టి భారత్ విజయభేరి మోగించింది. ఈ విజయానికి గుర్తుగానే ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. అయితే యుద్ధం ముగిసి రెండు దశాబ్దాలు పూర్తయినా కార్గిల్‌పై ఆ యుద్ధముద్రలు మాత్రం చెరిగిపోలేదు. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటకక్షేత్రంగా ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
[/bg_collapse]

3. అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రంలోని జిల్లా జడ్జి గా నియమితులైన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి ఎవరు..?
A. అమిత్ బన్సాల్
B. అనురాగ్ సింగల్
C.అనురాగ్ శర్మ
D. వివేక్ మందా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: B
Explanation : వాషింగ్టన్, సెప్టెంబర్ 10: భారతసంతతికి చెందిన అనురాగ్ సింఘాల్‌ను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జిల్లా జడ్జిగా నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్.. సెనేట్‌కు పంపిన 17 న్యాయ నియామక ప్రతిపాదనల్లో సింఘాల్‌ది కూడా ఒకటి. ఫ్లోరిడాలోని దక్షిణాది జిల్లా జడ్జిగా ఉన్న జేమ్స్ ఐకోన్ స్థానంలోకి సింఘాల్ జడ్జిగా వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో ఈ పదవిని చేపట్టనున్న మొదటి భారతసంతతి వ్యక్తి సింఘాల్.
[/bg_collapse]

4. రక్షణ వ్యవస్థ బలోపేతానికి వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేయనుంది..?
A. 9.32 లక్షల కోట్లు
B. 10 లక్షల కోట్లు
C.8 లక్షల కోట్లు
D.9 లక్షల కోట్లు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5-7 ఏళ్లలో రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు
[/bg_collapse]

5. ఆధార్ కార్డు లోని ముఖ్యమైన వివరాలను మార్చుకునేందుకు సమర్పించవలసిన గుర్తింపు పత్రాలు జాబితాలో కొత్తగా ఎన్ని పత్రాలను చేర్చారు..?
A.31
B.32
C.33
D.34

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : ఆధార్‌ కోసం మరిన్ని గుర్తింపు పత్రాలకు అనుమతి
ఆధార్‌ కార్డు నమోదు, ఆ కార్డులోని వివరాలను మార్చుకొనేందుకు సమర్పించాల్సిన సమాచారానికి సంబందించి మరింత వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు నిబంధనలకు సవరణలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటి వరకూ వ్యక్తిగత గుర్తింపు కోసం 18 రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించడానికి వీలుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 31కి పెంచారు. నివాస ధ్రువీకరణకు 33 రకాల పత్రాలను అనుమతించేవారు. ఇప్పుడు 43కి పెంచారు. బంధుత్వ నిరూపణ గుర్తింపు పత్రాల సంఖ్యను 9 నుంచి 14కి, జన్మ ధ్రువీకరణ పత్రాల సంఖ్యను 4 నుంచి 14కి పెంచారు
[/bg_collapse]

6. ఎడారీకరణ ను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కాప్ 14 సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు..?
A. ఉత్తర ప్రదేశ్
B. ఢిల్లీ
C. ముంబై
D. బెంగుళూరు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం యునెటైడ్ నేషన్స్‌ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ)పై ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కాప్14 సదస్సు జరుగుతోంది.
సెప్టెంబర్ 2 నుంచి 13 వ తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్ పార్టీస్(కాప్)14 సదస్సుకి 200 దేశాల నుంచి 70 మంది పర్యావరణ మంత్రులు, 8వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. కాప్14కు భారత్ రెండేళ్లపాటు అధ్యక్షత వహించనుంది. ఈ కాప్14 సదస్సునుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న ప్రసంగించారు.
[/bg_collapse]

ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్

  1. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శుద్ధ జల సరఫరా ప్రాజెక్ట్ ఆరు వందల కోట్లతో ఎక్కడ నిర్మించడానికి శంకుస్థాపన చేశారు..?
    A. శ్రీకాకుళం
    B. విజయనగరం
    C. కృష్ణ
    D. గుంటూరు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు.
రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు
[/bg_collapse]

2. సింగపూర్‌లో సెప్టెంబర్ 9న నిర్వహించిన ‘ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు పాల్గొననున్నారు..?
A. బుగ్గన రాజేంద్రనాథ్
B. బొత్స సత్యనారాయణ
C. పిల్లి సుభాష్ చంద్రబోస్
D. వైయస్ జగన్మోహన్ రెడ్డి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : సింగపూర్‌లో సెప్టెంబర్ 9న నిర్వహించిన ‘ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించారు.
నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. 2034కు బలమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికోసం వివిధ అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తున్నామని బుగ్గన విశదీకరించారు
[/bg_collapse]

3. అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న ఎక్కడ ప్రారంభించారు..?
A. శ్రీకాకుళం
B. విజయనగరం
C. గుంటూరు
D. కడప

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న ప్రారంభించారు.
అనంతరం అక్షయపాత్ర వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పలాసలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏడాది క్రితం తిత్లీ తుపాన్‌లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు.
[/bg_collapse]

4. రాష్ట్రంలో పెలైట్ ప్రాజెక్టుగా ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ శ్రీకారం చుట్టారు..?
A. వైజాగ్
B. కర్నూలు
C. శ్రీకాకుళం
D. ప.గోదావరి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: C
Explanation : ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో సెప్టెంబర్ 6న నిర్వహించిన బహిరంగ సభలో ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రేషన్ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు.
[/bg_collapse]

5. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా ఎన్ని వేలు ఆర్థిక సాయం అందించే పథకానికి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబరు 15 నుంచి ప్రారంభంకానుంది..?
A. 10 వేలు
B. 15 వేలు
C. 8 వేలు
D. 12 వేలు
రూ.10వేల సంక్షేమ పండగ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించే పథకానికి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబరు 15 నుంచి ప్రారంభంకానుంది. నవంబరు 30 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి చివరి వారంలో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఎంత మందికి ఇవ్వాలి? సెలూన్లలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారికి ఆర్థిక సాయం ఇస్తారా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకానికి దాదాపు 2.5 లక్షల మంది ఎంపికయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
[/bg_collapse]


తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్

  1. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయిగా నిలిచిన చంద్రయాన్‌ మిషన్‌కు గుర్తుగా ఎక్కడ ఉన్నా ఒక మెట్రో రైలు స్టేషన్‌ను అంకితం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.
    A. హైదరాబాద్
    B. కర్ణాటక
    C. కోల్ కతా
    D. ఢిల్లీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : హైదరాబాద్‌ మెట్రో చంద్రయాన్‌
భారత అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయిగా నిలిచిన చంద్రయాన్‌ మిషన్‌కు గుర్తుగా ఒక మెట్రో రైలు స్టేషన్‌ను అంకితం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. చంద్రయాన్‌ ప్రయోగాలకు సంబంధించిన చిత్రాలతో ప్రదర్శనశాల, ఇతరత్రా సమాచారాన్ని ఈ స్టేషన్‌లో పొందుపర్చనుంది. అలానే తార్నాక నుంచి నాగోల్‌ వరకు మెట్రో మార్గాన్ని సైన్స్‌ కారిడార్‌గా ఎంపిక చేసింది. పలు పరిశోధన సంస్థలు ఉన్న ఈ మార్గంలోని 150 మెట్రో స్తంభాలపై ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రాలు కనిపించబోతున్నాయి.
[/bg_collapse]

2. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటున్న రాష్ర్టాల జాబితాలో ముందువరుసలో నిలుస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం ఎంత..?
A. 1st
B. 2nd
C. 3rd
D. 4th

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : (ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ): సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. అడ్డదిడ్డంగా అప్పులు తీసుకోకుండా భవిష్యత్ అవసరాలకు మాత్రమే రుణాలు తీసుకొంటున్నది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో అధికారికంగా 25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలను తాజా బడ్జెట్‌లో 21.39 శాతానికే పరిమితం చేయడంతోపాటు జీఎస్డీపీ (రూ.8,65,688 కోట్లు)లో ద్రవ్యలోటును 2.53 శాతానికే (రూ.24,081కోట్లకే) కట్టడిచేసింది. వాస్తవానికి ఏ రాష్ట్రం అప్పులైనా జీస్డీపీలో 25 శాతానికి లోబడి ఉండాలి. ఈ పరిమితికి మించి అప్పులు చేసిన రాష్ర్టాలపై ఆర్థికంగా ఆంక్షలు విధిస్తారు. అయినప్పటికీ దేశంలోని చాలా రాష్ర్టాలు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితికి మించి రుణాలు తీసుకొంటున్నాయి.
[/bg_collapse]

3. నాయుడమ్మ 79వ జయంతిని పురస్కరించుకుని నాయుడ మ్మ అవార్డులను 2019 సంవత్సరానికి ఎవరు అందుకున్నారు..?
A. డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, ఎన్వీఎస్ రెడ్డి
B. హనుమాన్ చౌదరి, నరేందర్ రెడ్డి
C. వినోద్ కుమార్, ఎన్ వి ఎస్ రెడ్డి
D. ఎవరు కాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : అవార్డుల ప్రదానసభలో ప్రముఖులు హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్ డాక్టర్ నాయుడమ్మ నేటితరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తిప్రదాత అని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. నాయుడమ్మ 79వ జయంతిని పురస్కరించుకుని తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో యలవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయుడమ్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాన భారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. నాయుడ మ్మ అవార్డులను అందుకున్నారు\
[/bg_collapse]

4. ఏ సంవత్సరానికి పూర్వం ఉన్న ఎగ్జిబిట్లన్నీ తెలంగాణవేనని ఆర్కియాలజీ తెలంగాణ విభజన కమిటీ చైర్మన్, ది న్యుమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డీ రాజారెడ్డి స్పష్టంచేశారు..?
A. 1956
B. 1969
C. 1952
D. 1949

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation :హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 1956వ సంవత్సరానికి పూర్వం ఉన్న ఎగ్జిబిట్లన్నీ తెలంగాణవేనని ఆర్కియాలజీ తెలంగాణ విభజన కమిటీ చైర్మన్, ది న్యుమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డీ రాజారెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ వారసత్వ చరిత్రను పదిలపర్చుకునే సందర్భం ఆసన్నమైనదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్కియాలజీ విభాగంలోని విలువైన విగ్రహాలు, స్థూపాలు, దాదాపు మూడు లక్షల నాణేలు, ఇతర అపురూపమైన వస్తువులు, ఆస్తుల పంపిణీకి ప్రధాన ప్రక్రియ ఇంకా మొదలుకావాల్సి ఉన్నదని తెలిపారు. విభజన కమిటీ, అధికారులు ఇప్పటివరకు ఒకసారి మాత్రమే భేటీ అయినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో రాజారెడ్డితో నమస్తే తెలంగాణ ప్రతినిధి మాట్లాడారు.
[/bg_collapse]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *